కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి ప్రాంతంలో ఆగి ఉన్న కంటైనర్ ని ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు బాగేపల్లి టౌన్ శివారులోని గంగోత్రి పెట్రోల్ బంక్ సమీపంలో తమ విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోను ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
0 Comments