Ad Code

వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ సాధించిన ఆర్సీబీ


హ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. 10 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే భువనేశ్వర్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ (12 పరుగులు) కూడా ఔటయ్యాడు. దీంతో, నిషాంత్ సింధు, జోస్ బట్లర్ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. అయితే, నిలకడగా ఆడుతున్న నిషాంత్ సింధు (20 పరుగులు) కూడా ఔటవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. మరికాసేపటికే బట్లర్ (19 పరుగులు) కూడా పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 50 పరుగులు) ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. రాహుల్ తేవాటియా (7 పరుగులు), హోల్డర్ (7 పరుగులు) కూడా వెంటవెంటనే ఔటవడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులు చేయగలిగింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32), విరాట్ కోహ్లీలు శుభారంభాన్ని ఇచ్చారు. వెంకటేశ్, పడిక్కల్ వెంటవెంటనే ఔటైనా పవర్‌ప్లేలో పదికి పైగా రన్‌రేట్‌తో పరుగులు రావడంతో ఆర్సీబీ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. చివర్లో టిమ్ డేవిడ్ (24 పరుగులు) ఔటైనా, జితేష్ శర్మ (11 నాటౌట్) సాయంతో మ్యాచ్‌ను విజయతీరాలకు కోహ్లీ చేర్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి ఐదు అవార్డులు దక్కాయి. ఈ ఏడాది లీగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచినందుకు గాను మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్, ఆరెంజ్ క్యాప్ విజేత, సూపర్ సిక్సెస్ ఆఫ్ ద సీజన్ పురస్కారాలను సొంతం చేసుకున్నాడు.

Post a Comment

0 Comments

Close Menu