Ad Code

ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల : మార్కుల్లో బాలికల హవా


ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్  అధికారికంగా ఫలితాలను విడుదల చేశారు. ఈసారి రాష్ట్రంలో మొత్తం ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. గత ఏడాది 81.14 శాతంగా ఉన్న పాస్ శాతం, ఈసారి 85.25 శాతానికి చేరింది. విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఇది మంచి సూచికగా భావిస్తున్నారు. ముఖ్యంగా బాలికలు మరోసారి ప్రతిభ చాటుతూ బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90 కాగా, బాలురది 82.68 శాతంగా నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల ఫలితాల్లో కూడా పురోగతి కనిపించింది. గత ఏడాది 72.8 శాతంగా ఉన్న పాస్ రేట్, ఈసారి 78.39 శాతానికి పెరగడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన విద్యా సంస్కరణలు, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు ఫలితాలు అందుబాటులోకి రావడంతో విద్యార్థుల్లో ఆనంద వాతావరణం నెలకొంది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి తక్షణమే మార్కులు చూసే సౌకర్యం కల్పించారు. అదనంగా డిజిటల్ సేవలను విస్తరించే భాగంగా "మనమిత్ర" వాట్సాప్ సేవ ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంచారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపితే వివరాలు పొందవచ్చు. అలాగే LEAP మొబైల్ యాప్, DigiLocker ద్వారా కూడా మార్కులు తెలుసుకునే అవకాశం ఉంది. ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థుల కోసం SMS విధానాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ఫోన్‌లో SSC హాల్ టికెట్ నంబర్ టైప్ చేసి 55352 లేదా 56300 నంబర్లకు పంపితే మార్కుల వివరాలు అందుతాయి.

Post a Comment

0 Comments

Close Menu