దేశీయ మార్కెట్లో లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో జెన్ 2 విడుదలైంది. ఇది ఆండ్రాయిడ్ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆన్-డివైస్ AI ఫీచర్లు, 13 అంగుళాల 3.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో నాలుగు JBL స్పీకర్లు ఉన్నాయి. 8GB RAM, 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 13-అంగుళాల 3.5K డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో నాలుగు JBL స్పీకర్లు ఉన్నాయి. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 39,999 ధరతో లభిస్తుంది. మే 1 నుంచి Lenovo.com, ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు, రిటైల్ స్టోర్‌లలో సేల్స్ స్టార్ట్ అవుతాయి. లాంచింగ్ ఆఫర్ గా రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్‌ను ఇస్తుంది. అలాగే ఈ టాబ్లెట్‌కు వన్ ఇయర్ వారంటీని అందిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 16 పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 18 వరకు రెండు OS అప్‌గ్రేడ్‌లు, 2030 వరకు నాలుగేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, AI నోట్స్, స్మార్ట్ రీడర్, AI క్రియేషన్ టూల్స్, లైవ్ ట్రాన్స్‌క్రిప్ట్ వంటి అనేక AI-ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సర్కిల్ టు సెర్చ్, గూగుల్ జెమిని, రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఆటోఫోకస్‌తో 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ ఫిక్స్‌డ్ ఫోకస్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. USB టైప్-సి పోర్ట్, Wi-Fi 7, బ్లూటూత్ 6 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో జెన్ 2 లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,200mAh బ్యాటరీ ఉంటుంది. ఈ టాబ్లెట్ బరువు 598 గ్రాములుగా ఉంది.

Post a Comment

Previous Post Next Post