Ad Code

నెల్లూరు నారాయణ ఆస్పత్రిలో తొలి టెలి-రోబోటిక్ సర్జరీ : వైద్యరంగంలో కొత్త అధ్యాయానికి నాంది : సీఎం చంద్రబాబును ఉవాచ


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నారాయణ ఆస్పత్రిలో ఉన్న రోగికి రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆస్పత్రి వైద్యులు రోబో సాయంతో శస్త్రచికిత్స నిర్వహించారు. అలాగే జీఎస్ఎల్ ఆస్పత్రిలో ఉన్న మరో రోగికి నారాయణ ఆస్పత్రి వైద్యులు దూరం నుంచే సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విధంగా రెండు ఆస్పత్రులు పరస్పరం సహకరించుకొని అత్యాధునిక వైద్య సేవలను అందించాయి. సీఎం క్యాంప్ కార్యాలయంలో నారాయణ మెడికల్ కాలేజీ-ఆస్పత్రులు, జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ-ఆస్పత్రుల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ వినూత్న వైద్య సేవల వివరాలను తెలియజేశారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా టెలి-రోబోటిక్ సర్జరీ నిర్వహించినట్లు ఆస్పత్రుల ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో నాలుగు సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం విశేషమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇది రాష్ట్ర వైద్యరంగానికి గర్వకారణమని అన్నారు. ఎక్కడి నుంచైనా స్పెషలిస్టుల సేవలు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు కూడా ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఎక్కడి నుంచైనా శస్త్రచికిత్స చేయగలిగే ఈ సాంకేతికత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోగులకు కూడా అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వైద్యరంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం నారాయణ, జీఎస్ఎల్ ఆస్పత్రులు చేసిన ఈ ప్రయోగం వైద్యరంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని సీఎం తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu