Ad Code

నాలుగో క్వార్టర్ లో రూ.1,353.8 కోట్ల నికర లాభాన్ని సాధించిన టెక్ మహీంద్రా : ఒక్కొక్క షేర్ కి రూ.36 చొప్పున డివిడెండ్


టెక్ మహీంద్రా 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ లో రూ.1,353.8 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్ తో పోలిస్తే ఇది 16 శాతం వృద్ధి. కార్యకలాపాల ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.15,076.1 కోట్లుగా నమోదైంది. 2026 ఆర్థిక సంవత్సరం మొత్తానికి లాభం 13.15 శాతం పెరిగి రూ.4,810.9 కోట్లకు చేరింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 3,794 మిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను దక్కించుకుంది. ఏఐ ఐటీ రంగానికి ముప్పు కాదని, అది వ్యాపార వృద్ధికి గొప్ప అవకాశమని కంపెనీ సీఈఓ మోహిత్ జోషి పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu