Ad Code

ఏ నెట్‌వర్క్ నుంచైనా సరే ఎయిర్‌టెల్‌లోకి పోర్ట్ అయ్యే కస్టమర్లకు లీటర్ పెట్రోల్ ఉచితం : ఎయిర్‌టెల్ డిస్ట్రిబ్యూటర్ ఆఫర్


తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన రేళ్ల సతీష్ అనే ఎయిర్‌టెల్ డిస్ట్రిబ్యూటర్ తన కొత్త స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా వినూత్న ప్రచారానికి తెరలేపారు. ప్రస్తుతం ఉన్న ఏ నెట్‌వర్క్ నుంచైనా సరే ఎయిర్‌టెల్‌లోకి పోర్ట్ అయ్యే కస్టమర్లకు లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. లీటర్ పెట్రోల్ దొరకడమే గగనంగా మారిన ఈ తరుణంలో, సిమ్ మారిస్తే చాలు ఉచితంగా పెట్రోల్ వస్తుండడంతో వాహనదారులు సదరు స్టోర్ ముందు క్యూ కట్టారు. బంకుల వద్ద గంటల తరబడి వేచి చూసినా దొరకని ఇంధనం ఇక్కడ దొరుకుతుండడంతో జనం ఎగబడుతున్నారు. వ్యాపార పబ్లిసిటీ కోసం సతీష్ ఎంచుకున్న ఈ 'టైమింగ్' చూసి నెటిజన్లు "భలే తెలివైన ఆలోచన" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu