బెంగళూరులో ఆదివారం రాత్రి నందిని లేఅవుట్‌లో బ్లూ లీఫ్ అనే ఎల్ఈడీ డిస్‌ప్లే తయారీ యూనిట్‌లో రాత్రి 12:30 గంటల ప్రాంతంలో జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. మంటలు వేగంగా భవనాన్ని చుట్టుముట్టి, పక్కనే ఉన్న పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహానికి వ్యాపించాయి. అక్కడ 50 మందికి పైగా యువతులు, మహిళలు బస చేస్తున్నారు. మంటలు తీవ్రమవుతుండటంతో, సురక్షితంగా బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో, వారంతా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భవనం పై అంతస్తుల నుండి కిందకు దూకినట్లు సమాచారం. భయభ్రాంతులతో భవనం నుండి దూకి వీధుల్లోకి పరుగెడుతున్న సీసీటీవీల్లో దృశ్యాలు ఘటనా స్థలంలో కనిపించాయి. కొందరికి స్వల్ప గాయాలైనప్పటికీ, నివాసితులందరూ ఎలాంటి ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
0 Comments