Ad Code

ఎలాన్ మస్క్ రోజువారీ సంపాదన రూ.1,960 కోట్లు


లాన్ మస్క్ నికర ఆస్తి విలువ నవంబర్ 2025 నాటికి సుమారుగా రూ.39.6 లక్షల కోట్లు. కేవలం 2025లోనే మస్క్ సంపద సుమారుగా రూ.6.4 లక్షల కోట్లు పెరిగింది. ఎలాన్ మస్క్ టెస్లా షేర్లు, స్పేస్‌ఎక్స్ విలువ ఆధారిత పెట్టుబడులు, క్రిప్టో, ఇతర వ్యాపారాల ద్వారా చాలా డబ్బు సంపాదిస్తాడు. మస్క్ కేవలం టెస్లాకే పరిమితం కాకుండా న్యూరాలింక్ (బ్రెయిన్-చిప్ టెక్నాలజీ), ది బోరింగ్ కంపెనీ (భూగర్భ సొరంగాలు), ఏఐ, ఇతర టెక్ ప్రాజెక్టులు అన్నీ అతని నికర విలువకు దోహదం చేస్తాయి. లైట్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం మస్క్ సెకనుకు రూ.2.2 లక్షలు సంపాదిస్తాడు. ఎలాన్ మస్క్ రోజుకు సుమారు రూ.1,960 కోట్లు సంపాదిస్తాడు. ఆ మొత్తంతో ఒక చిన్న పట్టణంలోని స్థిరాస్తి మొత్తాన్ని కొనుగోలు చేయవచ్చు. మస్క్ నెలసరి ఆదాయం సుమారుగా రూ.58,800 కోట్లు (సుమారుగా $5.8 బిలియన్ డాలర్లు). వార్షిక ఆదాయం సుమారుగా రూ.7.15 లక్షల కోట్లు (సుమారుగా $7.15 బిలియన్ డాలర్లు)గా అంచనా వేశారు. ఇది స్థిరమైన ఆదాయం కాదు.. ఇది మస్క్ షేర్ల విలువను బట్టి మారుతూ ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu