Ad Code

జర్నలిస్టును వేటకొడవలితో నరికి చంపిన రౌడీషీటర్ !


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట (వి.కోట)లో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని రౌడీ షీటర్ తమీమ్ కత్తితో నరికి హత్య చేశారు. పాత కక్షలు, వ్యక్తిగత గొడవలతో హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు తమీమ్ అనే రౌడీ షీటర్ అని, అతడికి జగన్మోహన్ రెడ్డికి మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఒక శ్రీగంధం స్మగ్లింగ్ కేసులో జగన్మోహన్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించి సహకరించాడనే కోపంతోనే, తమీమ్ ఈ హత్య చేసినట్లు సమాచారం. ఈ హత్య పక్కా పథకం ప్రకారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజూ ఉదయం వాకింగ్ కు వెళ్తారనే విషయాన్ని గమనించిన నిందితులు, ఆయన ఒంటరిగా ఉన్న సమయం చూసి వేటకొడవలితో దాడి చేసి ప్రాణాలు తీశారు. హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu