Ad Code

పారామెడికల్ కోర్సుల విద్యార్థులకు తొలిసారిగా సప్లిమెంటరీ పరీక్షలు


ఆంధ్రప్రదేశ్ లో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్, ఈసీజీ టెక్నిషియన్, కార్డియాలజీ తదితర కోర్సుల్లో ఇప్పటి వరకు సప్లిమెంటరీ పరీక్షలు అవకాశం లేదు. రెండేళ్ల వ్యవధి కలిగిన పారా మెడికల్ కోర్సుల్లో ఏదైనా సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితే మళ్లీ వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఈ విధానంపై ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకుంది. పారా మెడికల్ కోర్సులో చదివే విద్యార్థులకు తొలిసారిగా సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించబోతుంది. రెండేళ్ల వ్యవధి కలిగిన పారా మెడికల్ కోర్సు (డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్, ఈసీజీ టెక్నిషియన్, కార్డియాలజీ తదితర)ల్లో ప్రవేశాలు పొందిన వారు పరీక్షల్లో అనుత్తీర్ణులైతే వార్షిక పరీక్షల సమయంలో జరిపే సప్లిమెంటరీ పరీక్షలను రాసే వారు. ఈ విధానంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏడాదివరకు వేచి ఉండడంతో పాటు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు విద్యార్థులు నష్టపోకుండా ఉండేలా 2025-26 విద్యా సంవత్సరం నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా జారీచేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకారం అనుత్తీర్ణులైన విద్యార్థుల (ఫెయిల్ ) నుంచి ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సుమారు 5వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసే అవకాశం ఉంది. సప్లిమెంటరీ పరీక్షలను ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో నిర్వహిస్తామని 'ఏలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సెల్ (పారా మెడికల్) కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu