తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును వాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పిచ్చి రీల్స్ చేస్తున్న నకిలీ కానిస్టేబుల్ చరణ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రెండు రకాల పోలీస్ యూనిఫాంలతో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత కొద్దిరోజులుగా నిందితుడు చరణ్ తాను సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ విధుల్లో ఉన్నట్లు నమ్మిస్తూ ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తూ హల్‌చల్ చేస్తున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 'మీరు రేవంత్ రెడ్డిని కలవాలా? అయితే నాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి.. నేనే మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తా' అంటూ అతివిశ్వాసంతో మాట్లాడాడు. అలాగే ఐపీఎల్ సందర్భంగా ఎస్ఆర్‌హెచ్ - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ టికెట్లు ఇప్పిస్తానంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేసి హంగామా చేశాడు. ఈ రీల్స్ వైరల్ అవ్వడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. వారు ఆరా తీయగా అతడు అసలు పోలీసే కాదని తేలింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు చరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
0 Comments