గూగుల్‌ క్లౌడ్‌తో చేతులు కలిపిన కోవాసెంట్‌

గూగుల్‌ క్లౌడ్‌తో కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ చేతులు కలిపింది. జెమిని ఎంటర్‌ప్రైజ్‌ వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో నియంత్రిత పరిశ్రమల్లో ఏజెంట్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ ద్వారా ఏఐ ఆధారిత పరివర్తనను తెచ్చేందుకు ఇరు సంస్థలు కలిసి పని చేయనున్నాయి. తమ ఏజెంట్‌ మేనేజ్‌మెంట్‌ సూట్‌ని జెమిని ఎంటర్‌ప్రైజ్, గూగుల్‌ క్లౌడ్‌ ఏఐ మౌలిక సదుపాయాలతో మేళవించడం ద్వారా సంస్థలు ప్రయోగ స్థాయి నుంచి ఉత్పత్తి స్థాయికి చేరుకునేందుకు తోడ్పడనున్నట్లు కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ సీఈవో శ్రీకాంత్‌ చక్కిలం తెలిపారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org