Ad Code

ఘజియాబాద్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం


త్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌ ఇందిరాపురం గౌర్ గ్రీన్ అవెన్యూ అపార్ట్‌మెంట్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అభయ్ ఖండ్ ప్రాంతంలోని గౌర్ గ్రీన్ అవెన్యూ సొసైటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్ సముదాయంలోని 9, 10వ అంతస్తుల్లో ప్రారంభమైన మంటలు కొద్దిసేపటికే తీవ్రరూపం దాల్చాయి. బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా పక్కనే ఉన్న సుమారు 8 నుండి 10 ఫ్లాట్లకు విస్తరించడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ టెండర్లతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు. ప్రాథమిక విచారణ ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu