Ad Code

దేవుడి ఊరేగింపు సందర్భంగా కూలిన వంతెన : ఎనిమిది మందికి గాయాలు : సోషల్‌ మీడియాలో వీడియో క్లిప్‌ వైరల్‌


ర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూద్‌బిద్రి సమీపంలో ఈ సంఘటన జరిగింది. పుచ్చెమోగరులోని బావడ బైలు వద్ద ధర్మనేమ ఉత్సవం నిర్వహించారు. ఆ సందర్భంగా తాకోడే బార్కే దేవతల ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగించారు. 50 ఏళ్లనాటి పురాతన కాలి వంతెన మీదుగా దేవుడి ఊరేగింపు వెళ్లింది. అయితే మేళతాళాలు దాటిన తర్వాత ఆ వంతెన కూలిపోయింది. దీంతో దేవుడి పల్లకీ మోస్తున్న వారితో సహా వెనుక ఉన్న భక్తులు కింద పడిపోయారు. కాంక్రీట్‌, రాళ్లు పడటంతో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వంతెన కూలిన ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0 Comments

Close Menu