Ad Code

బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ మెంబర్‌గా పీవీ సింధు


బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్ల కమిషన్ చైర్మన్‌గా ఉన్న ఇండియా స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు ఇప్పుడు ఆ కౌన్సిల్‌లో పూర్తిస్థాయి ఓటింగ్ అధికారం కలిగిన మెంబర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ మేరకు శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్‌ ఏజీఏంకు సింధు తొలిసారి అటెండ్ అయింది. దీంతో యాక్టివ్ ప్లేయర్‌గా ఉంటూనే వరల్డ్ బ్యాడ్మింటన్ పాలనలో ఓటింగ్ హక్కు అందుకున్న ప్లేయర్‌గా నిలిచింది. బ్యాడ్మింటన్ తనకు ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు ఈ ఆట అభివృద్ధికి తన వంతు సహకారం అందించే అవకాశం దక్కడంపై సింధు కృతజ్ఞత వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లేయర్ల సమస్యలను, వారి అభిప్రాయాలను ఈ వేదికపై బలంగా వినిపిస్తానని ఆమె హామీ ఇచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu