Ad Code

భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతోన్నాం !


కోల్ కతలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కంచుకోట భవానీపూర్ నుంచి ఆమె ఈ దఫా కూడా బరిలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన సువేందు అధికారిని ఆమె ఎదుర్కొంటోన్నారు. కోల్ కతలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మమత బెనర్జీ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతోన్నామని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తమకు అందిన సమాచారం ప్రకారం బెంగాల్‌లో బీజేపీ ఓడిపోతోందని తేల్చి చెప్పారు. మూడొంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. సీఆర్‌పీఎఫ్, కేంద్ర పరిశీలకులు ప్రజలను, మహిళలు, పిల్లలను కూడా కొడుతున్నారని, పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్నారని విమర్శించారు. పోలింగ్ కు ఒకరోజు ముందు రాత్రి నుంచి అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారని, తమ పార్టీ సానుభూతిపరులు చాలా మందిని కస్టడీలోకి తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని కోర్టు ధిక్కారంగా అభివర్ణించారు. ఇలాంటి నిర్బంధ ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ చూడలేదని మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఏ బూత్‌లో కూడా రాష్ట్ర పోలీసులు లేరని, కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలే అంతటా ఆధిపత్యం చెలాయిస్తున్నాయని ఆమె ఆరోపించారు. సరిహద్దులను కాపాడకుండా కేంద్ర బలగాలు ఒక రాజకీయ పార్టీకి భద్రత కల్పిస్తున్నాయని దీదీ విమర్శించారు. తాను 1984 నుండి ఎన్నికలలో పోటీ చేస్తున్నానని, పోలింగ్ సమయంలో ఇటువంటి భయానక వాతావరణం ఎప్పుడూ చూడలేదని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu