వన్‌ప్లస్ ప్యాడ్ 4 టాబ్లెట్ విడుదల

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్‌లో  ప్రీమియం ఆండ్రాయిడ్ టాబ్లెట్ సెగ్మెంట్ లో వన్‌ప్లస్ ప్యాడ్ 4ను ఆవిష్కరించింది. ఈ డివైస్, శక్తివంతమైన పెర్ఫార్మన్స్ , లాంగ్ టైం బ్యాటరీ కెపాసిటీ, స్మార్ట్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులోని Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ మల్టీటాస్కింగ్‌ను వేగవంతం చేస్తూ వినియోగదారులకు ల్యాప్‌టాప్ స్థాయి అనుభవాన్ని అందిస్తుంది.భారీ బ్యాటరీ లాంగ్ టైం వినియోగానికి అందిస్తూ వర్క్ , ఎంటర్టైన్మెంట్ రెండింటికీ సరిపడేలా రూపొందించారు . AI ఆధారిత టూల్స్, మల్టీ-విండో సపోర్ట్, క్రాస్-డివైస్ వంటి ఫీచర్లు , హై-రిజల్యూషన్ డిస్‌ప్లే, ఇమర్సివ్ ఆడియో సిస్టమ్‌తో ఈ టాబ్లెట్ విద్యార్థులు, ప్రొఫెషనల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇష్టపడేవారికి పర్ఫెక్ట్ గా ఉంటుంది . వన్‌ప్లస్ ప్యాడ్ 4 భారతీయ టాబ్లెట్ సెగ్మెంట్ లో బెస్ట్ గా నిలుస్తోంది. 13.2 ఇంచ్ 3.4K ట్రూ కలర్ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 540Hz టచ్ సాంప్లింగ్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్, 12-bit కలర్ డెప్త్ వంటి ఫీచర్లతో అత్యుత్తమ విజువల్ అనుభవాన్ని ఇస్తుంది. Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ CPU , GPU పెర్ఫార్మన్స్ ను గణనీయంగా పెంచుతూ మల్టీటాస్కింగ్ , గేమింగ్‌ను మరింత స్పీడ్ గా అందిస్తుంది . 13,380mAh భారీ బ్యాటరీ 54 రోజులు స్టాండ్ బై  టైమ్, 20 గంటలు వీడియో ప్లేబ్యాక్, 7 గంటలు గేమింగ్‌ను అందిస్తుంది. హీట్ కంట్రోల్ కోసం వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది . OxygenOS 16 ఆధారిత AI టూల్స్ అయిన AI Recorder, AI Painter, AI Writer, AI Translation, AI Speak లాంటివి వినియోగదారుల సౌలబ్యాన్ని అందిస్తాయి . Google Gemini AI అసిస్టెంట్ కూడా ఇందులో ఇంటిగ్రేట్ గా ఉంటుంది. PC-లెవల్ మల్టీటాస్కింగ్, మల్టీ-విండో సపోర్ట్, ఫైల్ మేనేజ్‌మెంట్,16,000 ప్రెషర్ లెవల్స్, అల్ట్రా-లో లేటెన్సీ OnePlus Stylo Pro , 78-కీ లేఅవుట్, AI కీ, NFC ఫైల్ ట్రాన్స్‌ఫర్ OnePlus Smart Keyboard ఉన్నాయి. సేఫ్టీ కోసం క్రయో-వేలాసిటీ కూలింగ్ సిస్టం, AI క్లియర్ కాల్, సెక్యూర్ కనెక్టివిటీ టెక్నాలజీలు అందించబడ్డాయి. కనెక్టివిటీ పరంగా Wi-Fi 5G సపోర్ట్, వేగవంతమైన డౌన్‌లోడ్స్ , అప్లోడ్స్, క్రాస్-డివైస్ సింక్ iOS, Mac, Android, Windows అందుబాటులో ఉన్నాయి. స్టోరేజ్ వేరియంట్స్‌లో 12GB + 512GB , 8GB + 256GB ఉన్నాయి. 8GB + 256GB వేరియంట్ రూ. 59,999,   12GB + 512GB వేరియంట్ రూ. 64,999/- ధరలో లభిస్తున్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి ₹5,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ టాబ్లెట్ సేల్స్ మే 5, 2026 నుండి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లలో ప్రారంభం కానున్నాయి . లిమిటెడ్ టైం ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు ₹5,499 విలువైన OnePlus Stylo Proను కొనుగోలుతో ఉచితంగా పొందే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default