Ad Code

దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ సలీం డోలా అరెస్ట్


ర్కీలోని ఇస్తాంబుల్‌లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత ఆప్తుడైన సలీం డోలా పట్టుబడ్డాడు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు గడగడలాడించే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన డోలా అరెస్టుతో, దావూద్ డ్రగ్స్ సామ్రాజ్యానికి లొజిస్టిక్స్ వెన్నెముక విరిగినట్లయింది. సలీం డోలా అంటే కేవలం ఒక నేరగాడు మాత్రమే కాదు.. దావూద్ ఇబ్రహీం అంతర్జాతీయ నార్కోటిక్స్ నెట్‌వర్క్‌ను సమన్వయం చేసే ప్రధాన 'మేనేజర్'. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ముంబై పోలీసుల డైరీలో డోలా పేరు పదేపదే వినిపిస్తుంటుంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు డ్రగ్స్ చేరవేసే మార్గాలను పర్యవేక్షించడం, అంతర్జాతీయ స్మగ్లర్లతో డీల్స్ కుదర్చడంలో ఇతను సిద్ధహస్తుడు. ముంబైలో జరిగిన ఒక భారీ డ్రగ్స్ స్కామ్ తర్వాత పరారీలో ఉన్న డోలా, ఇస్తాంబుల్ లో మారువేషంలో తలదాచుకుంటూ చివరకు అధికారుల చిక్కాడు.

Post a Comment

0 Comments

Close Menu