Ad Code

ఆంత్రోపిక్ బంపర్‌ ఆఫర్‌ !


ర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న స్టార్టప్ 'ఆంత్రోపిక్' ఒక అరుదైన ఉద్యోగ ప్రకటనతో టెక్‌ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ జీతాలంటే కోడింగ్‌లో నైపుణ్యం సాధించి ఉండాలి. కానీ, ఈ కొత్త పోస్టుకు అసలు కోడింగ్ నైపుణ్యాలే అవసరం లేదు. అయినప్పటికీ, ఏడాదికి ఏకంగా 4,00,000 డాలర్లు వరకు వేతనాన్ని ఆఫర్ చేస్తోంది. బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కో లేదా న్యూయార్క్ కేంద్రంగా పనిచేయాల్సిన ఈ రోల్‌ ప్రధానంగా కంపెనీ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆధారపడి ఉంటుంది. చిన్నపాటి వీవీఐపీ సమావేశాల నుంచి భారీ స్థాయి టెక్ ఈవెంట్‌లను ప్లాన్ చేయడం, వాటిని అమలు చేయడం వంటివి చేయాలి. విధానకర్తలు, విద్యావేత్తలతో ముఖాముఖి చర్చలు జరపాలి. ఆంత్రోపిక్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా ప్రదర్శించి వాటి సాంకేతిక అంశాలను వివరించాలి. ఈ ఉద్యోగంలో నెలకు సుమారు 10-12 రోజులు వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఈ భారీ జీతంపై ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఏఐ వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ చాలా చౌకగా, సులభంగా అందుబాటులోకి వస్తోంది. ఏదైనా ఒకటి సమృద్ధిగా లభించినప్పుడు దానికి భిన్నమైనది, అరుదుగా మారుతుంది' అని ఆయన విశ్లేషించారు. మెషీన్ జనరేటెడ్ టెక్స్ట్ పెరిగిపోతున్న తరుణంలో మనుషుల మధ్య జరిగే లైవ్ కమ్యూనికేషన్‌కు ఉన్న డిమాండ్‌ను ఈ ఉద్యోగం ప్రతిబింబిస్తోంది. ఈ భారీ ప్యాకేజీని దక్కించుకోవాలంటే అభ్యర్థుల నేపథ్యం, నైపుణ్యాల వివరణ చాలా ముఖ్యం. 'మీరు ఏఐ కంపెనీలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు?' అనే అంశంపై 200 నుంచి 400 పదాలలోపు ఒక స్పష్టమైన వ్యాసాన్ని సమర్పించాలి. దీన్ని విశ్లేషించి కంపెనీ యాజమాన్యం అభ్యర్థులను మెయిల్‌ ద్వారా సంప్రదిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu