ఎంట్రీ-లెవల్ వినియోగదారులను లక్ష్యంగా పోకో సీ 81 సిరీస్ ఫోన్లు విడుదల


దేశీయ మార్కెట్లో ఎంట్రీ-లెవల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని పోకో సీ 81 ఎక్స్, పోకో సీ 81 మోడళ్లను లాంచ్ చేసింది.ఈ పోకో సీ 81  సిరీస్ ఫోన్లు ముఖ్యంగా రోజువారీ వినియోగం కోసం రూపొందించబడ్డాయి. స్టూడెంట్స్, మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనేవారు, తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇవి సరైన ఎంపికగా కంపెనీ భావిస్తోంది. 4G కనెక్టివిటీతో వచ్చిన ఈ ఫోన్లు, బేసిక్ యూజ్‌తో పాటు స్మూత్ అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడ్డాయి. పోకో సీ 81 ఎక్స్ లో 6.88 అంగుళాల డిస్‌ప్లే ఉండగా, పోకో సీ 81 లో 6.9 అంగుళాల పెద్ద స్క్రీన్ అందించారు. రెండు మోడళ్లలోనూ 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. C81లో 800 నిట్స్, C81Xలో 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల బయట వెలుతురులో కూడా క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. 'వెట్ టచ్ టెక్నాలజీ 2.0', ఐ కంఫర్ట్ మోడ్ వంటి ఫీచర్లు యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని ఇస్తాయి. ఈ ఫోన్లలో UNISOC T7250 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. డైలీ యూజ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటి పనులకు ఇది సరిపోతుంది. 4GB వరకు ర్యామ్, అదనంగా వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ కూడా సులభమవుతుంది. సాఫ్ట్‌వేర్ పరంగా POCO C81 Android 16 ఆధారిత HyperOS 3పై, C81X Android 15 ఆధారిత HyperOS 2పై పనిచేస్తాయి. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సాధారణ ఫోటోగ్రఫీ, వీడియో కాల్స్‌కు ఇవి సరిపోతాయి. HDR+, నైట్ మోడ్ వంటి ఫీచర్లు లో-లైట్ ఫోటోగ్రఫీకి ఉపయోగపడతాయి. AI స్కై ఫీచర్ ద్వారా ఫోటోలను కస్టమైజ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ మోడ్‌తో స్కానింగ్ సులభమవుతుంది. బ్యాటరీ ఈ సిరీస్‌లో హైలైట్. పోకో సీ 81 Xలో 5200mAh బ్యాటరీ ఉండగా, పోకో సీ 81 లో 6300mAh భారీ బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించుకునేలా ఉంటుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే ఛార్జ్ అవుతుంది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains