మహిళలకు రక్షణ కల్పించడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది !


శ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీలకంగా భావించే నియోజకవర్గాల్లో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పటికీ పరిస్థితుల్లో ఏమీ మార్పులేదని, ఈసారి కచ్చితంగా ప్రభుత్వం మారాల్సిందేనన్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎక్కడా చూసినా అమ్మ కన్నీటి జల్లే కనిపిస్తుంది. మనిషి అనేవాడు భయమనే ముల్లుపై అడుగులు వేస్తూ జీవిస్తున్నాడు. ఇక్కడ మట్టి ద్రోహల చెరలో ఉంది. ప్రధానంగా మహిళలకు రక్షణ కల్పించడంలో మమతా బెనర్జీ సర్కార్‌ పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల పట్ల అరాచకాలే కన్పిస్తున్నాయి. కోల్‌కతా ఆర్జీ కార్‌ ఆస్పత్రిలో ఓ యువ మహిళా డాక్టర్‌ను దారుణంగా పాడుచేసి చంపేశారు. ఇక కోల్‌కతా నగరానికి 20 కి.మీ దూరంలో ఉన్న కమ్దునిలో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ తరహా ఘటనలే పశ్చిమ బెంగాల్‌లో కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రభుత్వం మీకు కావాలా ? లేక మహిళలకు అండగా ఉండే మా ప్రభుత్వం కావాలా?, ప్రభుత్వాన్ని మార్చి చూడండంటూ బెంగాల్‌ ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org