Posts

Showing posts with the label PM Narendra Modi

నీట్ పేపర్ లీకేజీ : దోషరహిత పరీక్షా వ్యవస్థను నిర్మించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన

Image
ఎ న్డీఏ ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ  మాట్లాడుతూ పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ఆయన కోరారు. దోషరహిత పరీక్షా వ్యవస్థను నిర్మించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. రాజకీయ భిన్నాభిప్రాయాలు పక్కనపెట్టి అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు. దేశ భవిష్యత్తు అలాగే యువత సంక్షేమం అత్యంత ముఖ్యమని మోడీ తెలిపారు. యువతను తప్పుదారి పట్టించే పనులు అసలు చేయవద్దని హెచ్చరించారు. పిల్లలను అనవసరంగా రెచ్చగొట్టడం సరికాదని స్పష్టం చేశారు. వారికి సరైన మార్గాన్ని చూపించి మంచి భవిష్యత్తును అందించాలని రాజకీయ నేతలను కోరారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవస్థలో మార్పుల కోసం అందరి మద్దతు అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.

ఆవిష్కరణలు అనేవి భారతదేశ నైజంలోనే ఉన్నాయి : ప్రధాని నరేంద్ర మోడీ

Image
\ ఫ్రాన్స్ లోని నైస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించి మాట్లాడుతూ ఆవిష్కరణలు అనేవి భారతదేశ నైజంలోనే ఉన్నాయని, సుస్థిర భవిష్యత్తు, ప్రపంచం కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోందని అన్నారు. భారతదేశం ప్రపంచంలో పరిష్కారాలను స్వీకరించే దేశంగా కాకుండా, పరిష్కారాలను అందించే దేశంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో భారతదేశం ఒక బలమైన ఆవిష్కరణల వ్యవస్థను సృష్టించిందని, నేడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా ఇండియా ఉందన్నారు. స్టార్టప్‌లు భారతదేశ వృద్ధికి, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ దశాబ్దం విప్లవాత్మక మార్పులకు, అభివృద్ధికి రెండింటికీ సంబంధించినదని అన్నారు. సాంకేతికను కొత్త పుంతలు తొక్కించేందుకు ఇండియాతో కలిసి పని చేసేందుకు రావాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఏఐ రంగంలో భారతదేశానికి అపారమైన సామర్థ్యం ఉందని, నూతన ఆవిష్కరణల ద్వారా జీవితాలను మార్చవచ్చని అన్నారు. ప్రధాని మోడీ జీ7 సదస్సు కోసం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు.

వియత్నాంతో భారత్ చారిత్రక మైత్రి !

Image
భా రత ప్రధాని నరేంద్ర మోడీ, వియత్నాం అధ్యక్షుడు టో లామ్ మధ్య బుధవారం జరిగిన భేటీ రెండు దేశాల దౌత్య సంబంధాలలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను "మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా" నవీకరించినట్లు ప్రధాని మోడీ అధికారికంగా ప్రకటించారు. వియత్నాంను భారతదేశపు "యాక్ట్ ఈస్ట్" విధానానికి మరియు "విజన్ మహాసాగర్"కు ఒక కీలకమైన స్తంభంగా ఆయన అభివర్ణించారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని భారీగా పెంచడం. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని 25 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2.1 లక్షల కోట్లు) చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని వెల్లడించారు. దీని కోసం మార్కెట్ ప్రాప్యతను సులభతరం చేస్తూ పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ముఖ్యంగా వియత్నాంలో భారతీయ మందుల లభ్యతను పెంచేందుకు రెండు దేశాల ఔషధ నియంత్రణ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే వ్యవసాయం, మత్స్య , పశుసంవర్ధక ఉత్పత్తుల ఎగుమతిని సరళతరం చేయాలని నిర్ణయించారు. వియత్నాం అధ్యక్షుడు టో లామ్ తన భారత పర్యటనను బీహార్‌లోని బోధ్‌గయ నుంచి ప్రారంభించడంపై ప్రధాని మ...

మహిళలకు రక్షణ కల్పించడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది !

Image
ప శ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీలకంగా భావించే నియోజకవర్గాల్లో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పటికీ పరిస్థితుల్లో ఏమీ మార్పులేదని, ఈసారి కచ్చితంగా ప్రభుత్వం మారాల్సిందేనన్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎక్కడా చూసినా అమ్మ కన్నీటి జల్లే కనిపిస్తుంది. మనిషి అనేవాడు భయమనే ముల్లుపై అడుగులు వేస్తూ జీవిస్తున్నాడు. ఇక్కడ మట్టి ద్రోహల చెరలో ఉంది. ప్రధానంగా మహిళలకు రక్షణ కల్పించడంలో మమతా బెనర్జీ సర్కార్‌ పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల పట్ల అరాచకాలే కన్పిస్తున్నాయి. కోల్‌కతా ఆర్జీ కార్‌ ఆస్పత్రిలో ఓ యువ మహిళా డాక్టర్‌ను దారుణంగా పాడుచేసి చంపేశారు. ఇక కోల్‌కతా నగరానికి 20 కి.మీ దూరంలో ఉన్న కమ్దునిలో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ తరహా ఘటనలే పశ్చిమ బెంగాల్‌లో కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రభుత్వం మీకు కావాలా ? లేక మహిళలకు అండగా ఉండే మా ప్రభుత్వం కావాలా?, ప్రభుత్వాన్ని మార్చి చూడండంటూ బెంగాల్‌ ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. 

బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ ఆటలు ఇక సాగవు!

Image
ప శ్చిమ బెంగాల్‍లోని పురూలియాలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడుతూ  బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ ఆటలు ఇక సాగవని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వారంతా ఈ నెల 29 లోగా పోలీస్ స్టేషన్‍లో లొంగిపోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఆదివాసీల భూములను సిండికేట్లు ఆక్రమించుకున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ 'కట్-మనీ' (కమీషన్) తీసుకుంటోందని ద్వజమెత్తారు. రాష్ట్రంలో ఉపాధి కొరత, పరిశ్రమల కొరతకు టీఎంసీనే కారణమన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు టీఎంసీ సిండికేట్ గుప్పిట్లో ఉన్నాయని ప్రధాని అన్నారు. వ్యవసాయ మండీలు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల నియంత్రణను అధికార పార్టీ తమ 'సిండికేట్' సభ్యులకు అప్పగించిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకిలించివేస్తామని ఆయన శపథం చేశారు. మమతా ప్రభుత్వం ఉపాధ్యాయ నియామక ప్రక్రియను దోచుకుందని, వేలాది మంది యువతను మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. 15 ఏళ్ల పాలనలో ప...

కుంభమేళాను ప్రపంచం మెచ్చేలా వైభవంగా, అత్యంత పరిశుభ్రంగా జరుపుకుందాం !

Image
ఉ త్తరాఖండ్‌లో ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కుంభమేళాను ప్రపంచం మెచ్చేలా వైభవంగా, అత్యంత పరిశుభ్రంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. దేవభూమి'గా పిలవబడే ఉత్తరాఖండ్‌ను శుభ్రంగా ఉంచే బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే లేదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని ప్రధాని కోరారు. కుంభమేళా వంటి పవిత్ర కార్యక్రమాల సమయంలో పుణ్యస్థలాల పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, భారతీయ సాంస్కృతిక విలువలను ప్రపంచానికి చాటిచెప్పాలని సూచించారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనే తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణ సమయం 6 గంటల నుంచి కేవలం రెండున్నర గంటలకు తగ్గనుంది. భక్తుల రాక పెరగడం వల్ల స్థానిక యువతకు ఉపాధి మార్గాలు మెరుగవుతాయని ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వేలు, జల మరియు వాయు మార్గాల అభివృద్ధి దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని, ఈ ప్రాంత ఆర్థిక స్వరూపాన్ని ఈ కొత్త ప్రాజెక్ట్ పూర్తిగా మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రాష్ట్ర భద్రతనమమతా బెనర్జీ ఫణంగా పెడుతున్నారు !

Image
ప శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూచ్ బిహార్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగిస్తూ  చొరబాటుదారులకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు తెలుపుతోందని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర భద్రతను పణంగా పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, టీఎంసీ నాయకులు బెదిరింపులకు పాల్పడినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన తీసుకురావడానికి ప్రజలంతా బీజేపీకి అండగా నిలవాలని ఆయన కోరారు. బెంగాల్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఈ అవినీతి ప్రభుత్వాన్ని శాశ్వతంగా సాగనంపే సమయం ఆసన్నమైందని ప్రధాని మోడీ ప్రజలకు స్పష్టం చేశారు. టీఎంసీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను కనీసం లెక్కచేయడం లేదని ప్రధాని మోడీ మండిపడ్డారు. మాల్డాలో రెండు మూడు రోజుల క్రితం జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని గుర్తు చే...

కాంగ్రెస్‌ తలపై తుపాకీ ఎక్కుపెట్టి ఆర్జేడీ సీఎం అభ్యర్థి అవకాశాన్ని దక్కించుకుంది !

Image
బీ హార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరాలో నిర్వహించిన ప్రచార సభలో ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. 'జంగల్‌రాజ్‌'ను బీహార్‌ ప్రజలు మర్చిపోలేదని, ఆ నేతలు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని చవిచూడబోతున్నారని విమర్శించారు. ఆర్జేడీకి అనుకూలంగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్ అనుకోలేదని, తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించేందుకు హస్తం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా లేదని, కాంగ్రెస్‌ తలపై తుపాకీ ఎక్కుపెట్టి మరీ ఆర్జేడీ ఆ అవకాశాన్ని దక్కించుకుందని ఆరోపించారు. ఎన్నికల అనంతరం ఆ పార్టీల నేతలు పరస్పరం పోట్లాడుకుంటారని మోడీ అన్నారు. మహా కుంభమేళాను ఇరుపార్టీల నేతలు అవమానించారని, ఓ కాంగ్రెస్‌ నేత ఛఠ్‌ పూజను అపహాస్యం చేశారని, ఇకపై ఎవరూ అలా చేసేందుకు ధైర్యం చేయలేనంతగా గుణపాఠం నేర్పాలి ఓటర్లను కోరారు. జాతీయ భద్రతకు, సైన్యానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ను అమలు చేస్తున్నామని, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేశామని చెప్పారు. ఉగ్రవాదులను వారి గడ్డపైనే శిక్షించాలని ప్రతిజ్ఞ చేశామని, ఆపరేషన్ సిందూర్‌ రూపంలో దాన్ని నెరవ...