నీట్ పేపర్ లీకేజీ : దోషరహిత పరీక్షా వ్యవస్థను నిర్మించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన

న్డీఏ ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ  మాట్లాడుతూ పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ఆయన కోరారు. దోషరహిత పరీక్షా వ్యవస్థను నిర్మించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. రాజకీయ భిన్నాభిప్రాయాలు పక్కనపెట్టి అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు. దేశ భవిష్యత్తు అలాగే యువత సంక్షేమం అత్యంత ముఖ్యమని మోడీ తెలిపారు. యువతను తప్పుదారి పట్టించే పనులు అసలు చేయవద్దని హెచ్చరించారు. పిల్లలను అనవసరంగా రెచ్చగొట్టడం సరికాదని స్పష్టం చేశారు. వారికి సరైన మార్గాన్ని చూపించి మంచి భవిష్యత్తును అందించాలని రాజకీయ నేతలను కోరారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవస్థలో మార్పుల కోసం అందరి మద్దతు అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం