కుంభమేళాను ప్రపంచం మెచ్చేలా వైభవంగా, అత్యంత పరిశుభ్రంగా జరుపుకుందాం !


త్తరాఖండ్‌లో ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కుంభమేళాను ప్రపంచం మెచ్చేలా వైభవంగా, అత్యంత పరిశుభ్రంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. దేవభూమి'గా పిలవబడే ఉత్తరాఖండ్‌ను శుభ్రంగా ఉంచే బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే లేదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని ప్రధాని కోరారు. కుంభమేళా వంటి పవిత్ర కార్యక్రమాల సమయంలో పుణ్యస్థలాల పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, భారతీయ సాంస్కృతిక విలువలను ప్రపంచానికి చాటిచెప్పాలని సూచించారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనే తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణ సమయం 6 గంటల నుంచి కేవలం రెండున్నర గంటలకు తగ్గనుంది. భక్తుల రాక పెరగడం వల్ల స్థానిక యువతకు ఉపాధి మార్గాలు మెరుగవుతాయని ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వేలు, జల మరియు వాయు మార్గాల అభివృద్ధి దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని, ఈ ప్రాంత ఆర్థిక స్వరూపాన్ని ఈ కొత్త ప్రాజెక్ట్ పూర్తిగా మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం