Posts

Showing posts with the label Uttarakhand

జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న సొరంగంలో భారీ ప్రమాదం : ఏడుగురు కార్మికులు దుర్మరణం

Image
ఉ త్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మాయాపుర్ వద్ద టీహెచ్‌డీసీ జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న సొరంగంలో  భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా కొండచరియలు విరిగిపడటంతోపాటు పెద్దఎత్తున మట్టి దిబ్బలు, నీరు ఒక్కసారిగా సొరంగంలోకి దూసుకురావడంతో లోపల విధులు నిర్వహిస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో హెచ్‌సీసీ సంస్థ నిర్మిస్తున్న ఈ సొరంగంలో మొత్తం 22 మంది కార్మికులు పనిచేస్తున్నారు.  నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, భారత ఆర్మీ, ఐటీబీపీ, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. నీరు, బురద ఎక్కువగా పేరుకుపోవడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రత్యేక డ్రమ్ బోట్ల ద్వారా సొరంగంలోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. హెవీ మెషినరీ ద్వారా మట్టిని తొలగిస్తూ, నీటిని బయటకు పంపింగ్ చేస్తున్నారు. గాయపడిన 14 మంది కార్మికులను సమీపంలోని గోపేశ్వర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం మెగా ఆస్పత్రులకు తరలించేందుకు అధికా...

అత్యంత పొడవైన జుట్టు ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన రేణు ధరియాల్

Image
ప్ర పంచంలోనే అత్యంత పొడవైన జుట్టు ఉన్న మహిళగా రేణు ధరియాల్ కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏప్రిల్‌ నెలలో ఈ రికార్డును అధికారికంగా ధృవీకరించారు. యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ అయిన రేణు ధరియాల్‌ నల్లని జుట్టు పొడవు 271.50 సెంటీమీటర్లు అంటే 8 అడుగుల 10 అంగుళాలు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి రాబర్ట్ వాడ్లో ఎత్తు (272 సెం.మీ) కంటే స్వల్పంగా మాత్రమే తక్కువ. గతంలో ఉక్రెయిన్‌కు చెందిన అలియా నాసిరోవా పేరిట ఉన్న 257.33 సెం.మీ (8 అడుగుల 5.3 అంగుళాలు) రికార్డును రేణు బద్దలు కొట్టారు. రేణు, 2015 నుంచి తన జుట్టును ఒక్కసారి కూడా కత్తిరించకుండా చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు.

విద్యుత్‌ సాయంతో నడిచే ఎగిరే వాహనాన్ని రూపొందించిన రవి తామ్తా

Image
ఉ త్తరాఖండ్‌లోని అల్మోడా జిల్లాకు చెందిన యువ ఆవిష్కర్త రవి తామ్తా భారత్‌లో తొలిసారిగా విద్యుత్‌ సాయంతో నడిచే వ్యక్తిగత ఎగిరే వాహనాన్ని రూపొందించారు. కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి తామ్తా తన 'హపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్' స్టార్టప్ ద్వారా అభివృద్ధి చేసిన 'HAPIDA SKYNeX' ప్రోటోటైప్ మొదటి పరీక్షా విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఏళ్ల తరబడి సాగిన పరిశోధనల ఫలితంగా ఈ టెక్నాలజీ సాకారమైంది. సాంప్రదాయ విమానాల మాదిరిగా విమాన ఇంధనం లేదా ఇథనాల్ ఆధారిత ప్రొపల్షన్‌పై ఆధారపడకుండా ఈ 'స్కైనెక్స్‌' విద్యుత్ శక్తితో పనిచేస్తుంది. ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల చేయని పర్యావరణ హితమైన ఈ వాహనం, దేశీయంగా ఆధునిక రవాణా వ్యవస్థల రూపకల్పనలో యువ పారిశ్రామికవేత్తల సత్తాను చాటిచెప్పింది. ఈ ఘనత సాధించిన రవి తామ్తాను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు అభినందించారు.

భారీ వర్షంలో యువతిని మధ్యలో దింపేసిన రాపిడో డ్రైవర్ : మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నెటిజన్లు

Image
ఉ త్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో రైడ్-హెయిలింగ్ సేవకు సంబంధించిన ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. భారీ వర్షం కురుస్తున్న రాత్రి సమయంలో రాపిడో డ్రైవర్ తనను, తన స్నేహితురాలిని ప్రయాణం మధ్యలోనే దింపేసి వెళ్లిపోయాడని ఓ యువతి ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెహ్రాడూన్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ జాన్వి చౌదరి ఈ ఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత దారుణమైన ప్రయాణ అనుభవాల్లో ఇదొకటని ఆమె వీడియోలో పేర్కొన్నారు. రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో భారీ వర్షంలో తాను, తన స్నేహితురాలు ప్రయాణిస్తున్న సమయంలో మార్గం విషయంలో డ్రైవర్‌తో వాగ్వాదం జరిగిందని ఆమె పేర్కొన్నారు. యాప్‌లో చూపిన మార్గాన్ని అనుసరించకుండా కొండల వెనుక ఉన్న మరో దారిలో వెళ్లాలని డ్రైవర్ పట్టుబట్టాడని, తాము అంగీకరించకపోవడంతో ప్రయాణాన్ని మధ్యలోనే నిలిపివేసి రోడ్డుపక్కన దింపేసి వెళ్లిపోయాడని ఆమె ఆరోపించారు. దీంతో భారీ వర్షంలో మరో వాహనం కోసం వేచి ఉండాల్సి వచ్చిందని చెప్పారు.ఈ వీడియో వైరల్ కావడంతో రాపిడో స్పందించింది...

విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసు : భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

Image
వి శాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని లెంక రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆమె భర్త శ్రీచరణ్ ను  ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్ డీఎస్పీ జేసీ పంత్ ఆధ్వర్యంలో పోలీసు బృందం ప్రస్తుతం ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తోంది. శ్రీచరణ్ ను కోర్టులో హాజరుపరిచి, పోలీస్ కస్టడీకి తీసుకుని రాధాగాయత్రి మృతికి సంబంధించి విచారణ చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన రాధాగాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి తమ కుమార్తె మృతిపై న్యాయం చేయాలంటూ ఉత్తరాఖండ్లోని డెహ్రాదూన్లో న్యాయపోరాటం చేస్తున్నారు. రాధాగాయత్రిది ఆత్మహత్య కాదని, ఆమె భర్త శ్రీచరణే పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడని ఆమె తండ్రి సుధాకర్ మొదటి నుంచి గట్టిగా ఆరోపిస్తున్నారు. పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే అదనపు కట్నం కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం శ్రీచరణ్, అతని కుటుంబ సభ్యులు రాధాగాయత్రిని వేధించేవారని, ఈ క్రమంలోనే ముస్సోరీ టూర్కు తీసుకెళ్లి ఆమెను హతమార్చారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘోర ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని డెహ్రాడూన్ జిల్లా కలెక్టర...

ఆర్థిక అవకతవకల ఆరోపణలపై విచారణకు ఆదేశించిన బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ

Image
ఉ త్తరాఖండ్‌ బద్రీనాథ్‌ ధామ్‌లో ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ  వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది. బద్రీనాథ్ ఆలయానికి వచ్చే భక్తుల విరాళాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఒక సంస్థ సోషల్ మీడియాలో చేసిన తర్వాత ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన టెంపుల్ కమిటీ, అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణలు కూడా కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ  అధ్యక్షుడు హేమంత్ ద్వివేది.. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను తీసిపారేయలేమన్నారు. అందుకే పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే తెరపైకి వచ్చిన ఆరోపణలపైనా ఆయన స్పందించారు. గోల్‌మాల్‌కు పాల్పడ్డాడని చెబుతున్న వ్యక్తి తన వ్యక్తిగత కార్యదర్శి కాదని.. ఆయన సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రంగడ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించినట్లు వెల్లడించారు....

కుంభమేళాను ప్రపంచం మెచ్చేలా వైభవంగా, అత్యంత పరిశుభ్రంగా జరుపుకుందాం !

Image
ఉ త్తరాఖండ్‌లో ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కుంభమేళాను ప్రపంచం మెచ్చేలా వైభవంగా, అత్యంత పరిశుభ్రంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. దేవభూమి'గా పిలవబడే ఉత్తరాఖండ్‌ను శుభ్రంగా ఉంచే బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే లేదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని ప్రధాని కోరారు. కుంభమేళా వంటి పవిత్ర కార్యక్రమాల సమయంలో పుణ్యస్థలాల పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, భారతీయ సాంస్కృతిక విలువలను ప్రపంచానికి చాటిచెప్పాలని సూచించారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనే తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణ సమయం 6 గంటల నుంచి కేవలం రెండున్నర గంటలకు తగ్గనుంది. భక్తుల రాక పెరగడం వల్ల స్థానిక యువతకు ఉపాధి మార్గాలు మెరుగవుతాయని ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వేలు, జల మరియు వాయు మార్గాల అభివృద్ధి దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని, ఈ ప్రాంత ఆర్థిక స్వరూపాన్ని ఈ కొత్త ప్రాజెక్ట్ పూర్తిగా మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆర్మీ క్యాంప్‌లోని స్టోర్‌లో భారీ అగ్నిప్రమాదం

Image
ఉ త్తరాఖండ్‌ లోని జోషిమఠ్‌, ఔలి రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంప్‌లోని స్టోర్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు విస్తరించకుండా వెంటనే అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. గత ఏడాది మేలో కూడా లెహ్‌లోని డిగ్రీ కాలేజీ సమీపంలో ఉన్న ఆర్మీ క్యాంపులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు సమీపంలోని భవంతులకు విస్తరించడంతో స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సమన్వయంతో మంటలను అదుపుచేశాయి. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు. అయితే ప్రమాదానికి కారణాలను మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. దీనికి మందు గత జనవరిలో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ఆర్మీ క్యాంటిన్‌లోనూ అగ్నిప్రమాదం జరిగింది. బదామీ బాఘ్ కంటోన్మెంట్ ఏరియాలో జరిగిన ఈ ఘటనలో తీవ్రగాయలతో ఒక పౌరుడు మృతిచెందాడు. 

పీపల్ కోటి సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు : 60 మందికి గాయాలు

Image
ఉ త్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో టీహెచ్డీసీ నిర్మిస్తున్న విష్ణుగఢ్ - పీపల్ కోటి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన పీపల్ కోటి సొరంగంలో మంగళవారం అర్థరాత్రి రెండు లోకోమోటివ్ రైళ్ళు ఢీకొన్నాయి. షిఫ్ట్ మార్తున్న సమయంలో కార్మికులు, అధికారులను తీసుకెళుతున్న రైలు, నిర్మాణ సామాగ్రితో వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో రైల్లో 109 మందికి పైగా కార్మికులు, అధికారులు ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో సొరంగం లోపల కార్మికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. చీకటిగా ఉండే సొరంగం లోపల ఈ ప్రమాదం జరగడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో మొత్తం 60 మందికి గాయాలు కాగా, వారిలో 10 మందిని గోపేశ్వర్‌లోని జిల్లా ఆసుపత్రికి, మరో 17 మందిని పీపలో కోటిలోని వివేకానంద ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. సమాచారం అందిన వెంటనే జిల్లా మెజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని, ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా అలకనంద నదిపై 444 మెగావాట్ల సామర్థ్య...

అదుపుతప్పి లోయలో పడిన బస్సు : ఏడుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Image
ఉ త్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం  భికియాసైన్ నుండి రామ్‌నగర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి వినాయక్ ప్రాంతంలోని ఒక లోయలో పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు తెల్లవారుజామున సుమారు 6 గంటలకు ద్వారహత్ నుండి బయలుదేరింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో శైలాపాని సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వందల అడుగుల లోయలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠశాల సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం !

Image
ఉ త్తరాఖండ్ లోని అల్మోరా జిల్లా, దబారా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈ పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. పాఠశాల సమీపంలోని పొదల్లో అనుమానాస్పద ప్యాకెట్స్‌ ఉండటాన్ని గమనించిన ప్రిన్సిపల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి వచ్చి పరిశీలించగా అందులో ఆ ప్యాకెట్‌లలో జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నాయి. దాంతో డాగ స్క్వాడ్‌ను రప్పించి పొదల్లో తనిఖీ చేయించగా అక్కడికి 20 అడుగుల దూరంలో మరికొన్ని ప్యాకెట్‌లు లభ్యమయ్యాయి. వాటిలో కూడా జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నాయి. మొత్తం 161 జిలెటిన్‌ స్టిక్స్‌ లభ్యమయ్యాయని, వాటి బరువు 20 కిలోలు ఉన్నదని పోలీసులు తెలిపారు. అసలు ఆ జిలెటిన్‌ స్టిక్స్‌ను గ్రామంలోకి ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.