ఉత్తరాఖండ్‌లోని అల్మోడా జిల్లాకు చెందిన యువ ఆవిష్కర్త రవి తామ్తా భారత్‌లో తొలిసారిగా విద్యుత్ సాయంతో నడిచే వ్యక్తిగత ఎగిరే వాహనాన్ని రూపొందించారు. కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి తామ్తా తన 'హపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్' స్టార్టప్ ద్వారా అభివృద్ధి చేసిన 'HAPIDA SKYNeX' ప్రోటోటైప్ మొదటి పరీక్షా విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఏళ్ల తరబడి సాగిన పరిశోధనల ఫలితంగా ఈ టెక్నాలజీ సాకారమైంది. సాంప్రదాయ విమానాల మాదిరిగా విమాన ఇంధనం లేదా ఇథనాల్ ఆధారిత ప్రొపల్షన్‌పై ఆధారపడకుండా ఈ 'స్కైనెక్స్' విద్యుత్ శక్తితో పనిచేస్తుంది. ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల చేయని పర్యావరణ హితమైన ఈ వాహనం, దేశీయంగా ఆధునిక రవాణా వ్యవస్థల రూపకల్పనలో యువ పారిశ్రామికవేత్తల సత్తాను చాటిచెప్పింది. ఈ ఘనత సాధించిన రవి తామ్తాను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు అభినందించారు.
0 Comments