ప్రభుత్వ పాఠశాల సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం !


త్తరాఖండ్ లోని అల్మోరా జిల్లా, దబారా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈ పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. పాఠశాల సమీపంలోని పొదల్లో అనుమానాస్పద ప్యాకెట్స్‌ ఉండటాన్ని గమనించిన ప్రిన్సిపల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి వచ్చి పరిశీలించగా అందులో ఆ ప్యాకెట్‌లలో జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నాయి. దాంతో డాగ స్క్వాడ్‌ను రప్పించి పొదల్లో తనిఖీ చేయించగా అక్కడికి 20 అడుగుల దూరంలో మరికొన్ని ప్యాకెట్‌లు లభ్యమయ్యాయి. వాటిలో కూడా జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నాయి. మొత్తం 161 జిలెటిన్‌ స్టిక్స్‌ లభ్యమయ్యాయని, వాటి బరువు 20 కిలోలు ఉన్నదని పోలీసులు తెలిపారు. అసలు ఆ జిలెటిన్‌ స్టిక్స్‌ను గ్రామంలోకి ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం