అదుపుతప్పి లోయలో పడిన బస్సు : ఏడుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు


త్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం  భికియాసైన్ నుండి రామ్‌నగర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి వినాయక్ ప్రాంతంలోని ఒక లోయలో పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు తెల్లవారుజామున సుమారు 6 గంటలకు ద్వారహత్ నుండి బయలుదేరింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో శైలాపాని సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వందల అడుగుల లోయలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం