Posts

Showing posts with the label Seven dead

ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు : ఏడుగురు మృతి, పది మందికి తీవ్ర గాయాలు

Image
ఆం ధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డ రోడ్డు సెంటర్‌ వద్ద ఆటోను ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. బాధితులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామస్థులుగా పోలీసులు తెలిపారు. వీరంతా ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్‌, వంగలపూడి అనిత, సత్య కుమార్‌ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడం, పలువురు గాయపడటంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివర...

అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట : ఏడుగురి మృతి, పలువురికి గాయాలు

Image
బీ హార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో అశోక్‌ధామ్ ఆలయానికి  సోమవారం ఉదయం భారీగా భక్తులు తరలిరావడంతో వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. భక్తులు అకస్మాత్తుగా పోటెత్తడంతో బారికేడ్ కూలిపోయి తొక్కిసలాట జరిగిందని కొందరు చెబుతున్నారు. ఆలయ ప్రాంగణంలో ఒక విద్యుత్ వైర్ తెగిపడిపోవడంతో విద్యుదాఘాతానికి గురైనట్టు మరికొందరు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాటు ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లపై కూడా పరిశీలన కొనసాగుతోంది.

పాకిస్తాన్‌లో జంట పేలుళ్లు : ఏడుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Image
పా కిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌, బన్నూ జిల్లాలోని మార్కాబేరా ప్రాంతంలో చోటుచేసుకున్న వరుస పేలుళ్లులో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మొదటి పేలుడు ప్రయాణికులతో వెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకోగా, రెండో పేలుడు సహాయక చర్యల కోసం అక్కడికి చేరుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు పోలీసులు తెలిపారు. బన్నూ జిల్లా పోలీస్ అధికారి యాసిర్ అఫ్రిది వెల్లడించిన వివరాల ప్రకారం, హతి ఖేల్ గ్రామం నుంచి బన్నూ నగరానికి వెళ్తున్న ఓ ప్యాసింజర్ వ్యాన్ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కన అమర్చిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ పేలింది. ఈ పేలుడు ధాటికి వ్యాన్ తీవ్రంగా దెబ్బతిని, ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మొదటి పేలుడు అనంతరం స్థానికులు, సహాయక బృందాలు బాధితులను రక్షించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కొద్దిసేపటికే అదే ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది. ఈ రెండో విస్ఫోటనంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఒక వాహనం ధ్వంసమైంది. మొత్తం రెండు పేలుళ్లలో ఏడుగురు మరణించగా, ముగ్గురు గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్...

రెండు బస్సులు ఢీకొని ఏడుగురు మృతి : 20 మందికి తీవ్రగాయాలు

Image
గు జరాత్‌లోని సూరత్ జిల్లా బార్డోలి పరిధిలోని ఉవా గ్రామం వద్ద మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెండు బస్సులు హైవేపై బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఒక బస్సు నియంత్రణ కోల్పోయి, డివైడర్‌ను దాటి అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లి ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో కనీసం ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది మహారాష్ట్రకు చెందినవారేనని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది, పోలీసులు, స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేస్తూనే బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించి, గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోగా, క్షతగాత్రులు రోడ్డు పక్కన సహాయం కోసం నిరీక్షిస్తున్న దృశ్యాలు కలచివేశాయి. సూరత్ రూరల్ ఎస్పీ రాజేష్ గధ్వి, రేంజ్ ఐజీ ప్రేమ్‌వీర్ సింగ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొ...

గాజాపై ఇజ్రాయెల్ దాడులు : ఏడుగురు మృతి

Image
ఇ జ్రాయెల్ శనివారం ఉదయం గాజా స్ట్రిప్‌లోని సెంట్రల్, సౌత్​ప్రాంతాలపై జరిపిన దాడుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. సెంట్రల్​గాజాలోని బురేజ్ క్యాంప్‌లో ఒక పోలీస్ పోస్ట్ సమీపంలో ఇజ్రాయెల్ డ్రోన్​తో రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఆరుగురు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. డెడ్​బాడీలతో పాటు గాయపడిన వారిని సెంట్రల్​గాజాలోని అల్-అక్సా ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అలాగే, సమీపంలోని అల్-అవ్దా ఆస్పత్రిలో ఒకరు మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సౌత్ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనుస్‌కు తూర్పున ఉన్న బని సుహేలా పట్టణంలో, నిరాశ్రయుల శిబిరంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేయగా.. ముగ్గురు గాయపడ్డారని నాసర్ మెడికల్ కాంప్లెక్స్ తెలిపింది.

కాబూల్‌లో భారీ బాంబు పేలుడు : ఏడుగురు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు!

Image
ఆ ఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సుమారు ఏడుగురు మరణించగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పెద్ద పెద్ద కార్యాలయ భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, రాయబార కార్యాలయాలు ఉన్న వాణిజ్య షహర్-ఎ-నావ్ పరిసరాల్లోని ఒక హోటల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. షహర్-ఎ-నవ్ కాబూల్‌లోని అత్యంత సురక్షితమైన ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తారు. గాయపడిన వారు కాబూల్‌లోని సర్జికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని ఆఫ్ఘన్ రాజధానిలో ఆసుపత్రిని నిర్వహిస్తున్న ఇటాలియన్ ఎన్జీఓ ఎమర్జెన్సీ తెలిపింది. అయితే ఈ పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటించలేదు. ఈ సంఘటన కారణంగా ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే దర్యాప్తును కూడా ప్రారంభించారు. అయితే, పేలుడు ఉగ్రవాద దాడా లేదా ఏదైనా సాంకేతిక కారణం వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కాబూల్‌లోని షహర్-ఎ-నౌ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌లో సోమవారం పేలుడు సంభవించిందని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఈ పేలుడులో చాలా మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్...

అదుపుతప్పి లోయలో పడిన బస్సు : ఏడుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Image
ఉ త్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం  భికియాసైన్ నుండి రామ్‌నగర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి వినాయక్ ప్రాంతంలోని ఒక లోయలో పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు తెల్లవారుజామున సుమారు 6 గంటలకు ద్వారహత్ నుండి బయలుదేరింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో శైలాపాని సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వందల అడుగుల లోయలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.