Ad Code

గాజాపై ఇజ్రాయెల్ దాడులు : ఏడుగురు మృతి


జ్రాయెల్ శనివారం ఉదయం గాజా స్ట్రిప్‌లోని సెంట్రల్, సౌత్​ప్రాంతాలపై జరిపిన దాడుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. సెంట్రల్​గాజాలోని బురేజ్ క్యాంప్‌లో ఒక పోలీస్ పోస్ట్ సమీపంలో ఇజ్రాయెల్ డ్రోన్​తో రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఆరుగురు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. డెడ్​బాడీలతో పాటు గాయపడిన వారిని సెంట్రల్​గాజాలోని అల్-అక్సా ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అలాగే, సమీపంలోని అల్-అవ్దా ఆస్పత్రిలో ఒకరు మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సౌత్ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనుస్‌కు తూర్పున ఉన్న బని సుహేలా పట్టణంలో, నిరాశ్రయుల శిబిరంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేయగా.. ముగ్గురు గాయపడ్డారని నాసర్ మెడికల్ కాంప్లెక్స్ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu