Ad Code

రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌పై అనుమానాస్పదంగా ఉన్న ఒక సూట్‌కేసు : తెరిచి చూడగా తల, చేతులు, కాళ్లు లేని మృతదేహం

మిళనాడు లోని పెరంబూర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌పై అనుమానాస్పదంగా ఉన్న ఒక సూట్‌కేసును స్థానికులు గమనించారు. దాన్ని తెరిచి చూడగా అందులో తల, చేతులు, కాళ్లు లేని ఒక వ్యక్తి మృతదేహం కనిపించడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య కేసును ఛేదించేందుకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే, మృతదేహంపై ఉన్న బ్రాండెడ్‌ బట్టల బార్‌కోడ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, దాని ఆధారంగా సాంకేతిక దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ బట్టలు కొనుగోలు చేసిన వివరాలు, నిందితుల మొబైల్ లోకేషన్‌ ఆధారంగా వారు ప్రస్తుతం తేనాంపేట, టి.నగర్‌ పరిసరాలలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Post a Comment

0 Comments

Close Menu