Ad Code

తనకు ఇష్టంలేని వ్యక్తితో పెళ్లి చేశారంటూ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసిన మహిళ


త్తరప్రదేశ్ హాథ్రస్ జిల్లాలో పూజ అనే మహిళ తనకు ప్రియుడే కావాలంటూ సెల్ టవర్ ఎక్కి  హల్ చల్ చేసింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. పూజ (30) అనే మహిళకు బర్మనే గ్రామానికి చెందిన వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి భర్తతోనే ఉంటున్న పూజ గత మంగళవారం మధ్యాహ్నం అనూహ్యంగా అత్తారింటి నుంచి బయటకు వచ్చి దగ్గర్లో ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో అక్కడికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అధికారులు ఎంత ప్రయత్నించినా ఆమె కిందకు దిగి రాలేదు. మండుటెండలో దాదాపు మూడు గంటల పాటు వారిని ముప్పుతిప్పలు పెట్టిన పూజ, చివరకు అధికారులు నచ్చజెప్పడంతో కిందకు దిగివచ్చింది. అనంతరం తనకు ఇష్టం లేకుండానే పెళ్లి చేశారని తాను భర్తతో ఉండలేనని చెప్పింది. తాను సమీప గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని అతడితోనే కలిసి జీవించాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను పోలీసులకు వివరించింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Post a Comment

0 Comments

Close Menu