Ad Code

డీజే హోరుకు మృత్యువాతపడిన 140 కోళ్లు


త్తరప్రదేశ్‌ లోని సుల్తాన్‌పూర్ జిల్లా దరియాపూర్ గ్రామంలో ఏప్రిల్ 25న ఒక పెళ్లి ఊరేగింపులో మోగించిన డీజే సౌండ్ కారణంగా తన కోళ్ల ఫారంలోని 140 కోళ్లు మృతి చెందాయని యజమాని సాబీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ శబ్దాల వల్ల కోళ్లు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు కోల్పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు డీజే ఆపరేటర్ కవి యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీజే సౌండ్ అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పక్షులు మరియు జంతువులలో అధిక తీవ్రత కలిగిన ధ్వని తరంగాలు ఒత్తిడిని మరియు గుండెపోటును కలిగిస్తాయని, దీనివల్ల కోళ్లు మరణించి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu