Ad Code

కాఫీ తోటల్లో నిల్వ ఉంచిన సుమారు 749 కిలోల గంజాయి పట్టివేత


ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని పనసపుట్టు పంచాయతీ పరిధిలోని సంఘం వలస గ్రామ సమీపంలో ఉన్న కాఫీ తోటల్లో నిల్వ ఉంచిన సుమారు 749 కిలోల గంజాయిని ఎస్సై నాని తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. నిందితులు ఈ గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు సిద్ధం చేయగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి దీనిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అంచనా ప్రకారం స్వాధీనం చేసుకున్న ఈ గంజాయి విలువ సుమారు రూ. 3.45 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేసే క్రమంలోనే వీటిని తోటల్లో దాచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముంచంగిపుట్టు పోలీసులు, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Post a Comment

0 Comments

Close Menu