అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్‌లో కాల్పులకు పాల్పడిన నిందితుడుని అమెరికా సీక్రెట్ ఏజెంట్ సర్వీసెస్ గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు కోలో టామోస్ అలెన్‌గా గుర్తించారు. మెకానికల్ ఇంజనీరింగ్‌తో పాటు కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ కూడా పూర్తి చేసినట్టు వెల్లడైంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏజెంలెస్ శివార్లలో ఉన్న టోరెన్స్ ప్రాంత వాసిగా గుర్తించారు. అతడి లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017లో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. 2017లో కాల్టెక్‌లో అతడు విద్యార్థిగా ఉన్నప్పుడే వీల్‌ఛైర్స్‌కు ఎమర్జెన్సీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా రూపొందించాడు. ఈ అంశం గురించి స్థానిక పత్రికలో కథనం కూడా వెలువడింది. ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తిశాడు. 2018లో ఓ వీడియోగేమ్‌ను కూడా తయారు చేసి ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేసుకొన్నాడు. ఇటీవల 'ఫస్ట్‌లా' పేరిట మరో గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు లింక్డిన్‌లో వెల్లడించాడు. 2014లో జెట్ ప్రొపెల్షన్ ల్యాబ్‌లో నాసా నిర్వహించిన ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో కూడా పాల్గొన్నాడు.
0 Comments