Ad Code

ఆగస్టు 1న పోకో M6 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌, బడ్స్‌ X1 విడుదల !


గస్టు 1న దేశీయ మార్కెట్‌లో పోకో M6 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌, బడ్స్‌ X1 విడుదల కానున్నాయి. ఈ రెండు ఉత్పత్తులకు సంబంధించిన టీజర్‌ను పోకో సంస్థ ఇటీవల విడుదల చేసింది. టిప్‌స్టర్‌ యోగేష్‌ తన X ప్లాట్‌ఫాం ద్వారా పోకో M6 ప్లస్‌, బడ్స్‌ X1 రిటైల్‌ బాక్స్‌ ఫోటోలను షేర్‌ చేశారు. ఈ ఫోటోల ఆధారంగా పోకో ఫోన్‌ కెమెరా మాడ్యూల్‌ రెడ్‌మి 13 5G తరహాలోనే ఉంది. లీక్‌ అయిన ఫోటోలో పోకో M6 ప్లస్‌ ఫోన్‌ బ్లూ కలర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు బ్లాక్‌, పర్పుల్‌ రంగుల్లోనే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. పోకో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో 3X జూమ్‌ సామర్థ్యంతో 108MP ప్రైమరీ కెమెరాను అమర్చారు. మరియు ఇతర కెమెరాల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5030mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. అయితే ఛార్జింగ్ సామర్థ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 2 AE చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. OS వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ధర, సేల్ వివరాలు ఆగస్టు 1న విడుదల సమయంలో తెలియనున్నాయి.పోకో బడ్స్‌ X1 విషయానికి వస్తే లీక్‌ అయిన వివరాల ఆధారంగా ఈ బడ్స్‌ తెలుపు రంగులో ఉన్నాయి. మరియు మాగ్నటిక్‌ ఛార్జింగ్‌ కేస్‌ లోపలి భాగం పసుపు రంగుల్లో ఉంది. దీంతోపాటు బ్యాటరీ ఛార్జింగ్‌ స్థితి తెలుసుకొనేందుకు LED లైట్‌ స్ట్రిప్‌ను కలిగి ఉంది. ఈ పోకో ఇయర్‌బడ్స్‌ను షియోమీ ఇయర్‌బడ్స్‌ యాప్‌ ద్వారా నియంత్రించవచ్చు.ఈ పోకో బడ్స్‌ X1 ఇయర్‌బడ్స్‌ ఇన్ ఇయర్‌ డిజైన్‌ సిలికాన్‌ టిప్స్‌, 12.4 డైనమిక్‌ టైటానియం డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. దీంతోపాటు 40dB వరకు హైబ్రిడ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌తో క్వాడ్ మైక్‌లను కలిగి ఉంటుంది. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌  పైన పనిచేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu