మారుతీ సుజుకీ కార్ల విక్రయాల్లో సరికొత్త మైలురాయిని సాధించింది. కంపెనీ మిడ్-సైజ్ హైబ్రిడ్ SUV గ్రాండ్ విటారా అమ్మకాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించింది. గ్రాండ్ విటారా లాంచ్ అయినప్పటి నుంచి అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. 23 నెలల కాలంలో కంపెనీ ఈ కారు 2 లక్షల యూనిట్లను విక్రయించింది. మిడ్-సైజ్ సెగ్మెంట్‌లోని ఏ కారుకైనా ఈ విక్రయాల సంఖ్య అత్యంత వేగవంతమైనదిగా కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా మారుతీ సుజుకీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో గ్రాండ్ విటారా మాకు అతిపెద్ద ప్రోడక్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ కారు హైబ్రిడ్ సెగ్మెంట్‌లోని వ్యక్తుల మొదటి ఎంపిక అని, అందుకే ఈ కారు 2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని ఆయన అన్నారు. కంపెనీ ఇంధన సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కారును ప్రవేశపెట్టింది. ఇది ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు, కారు అమ్మకాలు ఎల్లప్పుడూ బాగానే ఉన్నాయి. ఈ కారుకు పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ సపోర్ట్ ఉంది. ఇది మైలేజీని పెంచడంలో సహాయపడుతుంది. ఈ మోటార్ లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. మారుతి గ్రాండ్ విటారాలో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీని స్టాండర్డ్ వేరియంట్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హెడ్స్ అప్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీ కెమెరా, అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
0 Comments