కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్. డి. కుమార స్వామి ఆదివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సిబ్బంది వెంటనే ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతున్న సమయంలో ఆయన ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం స్రవించడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని విలేకర్లు గమనించి వెంటనే కేంద్ర మంత్రికి తెలియజేశారు. దీంతో కుమారస్వామి తన ముక్కు రంధ్రాలను గుడ్డతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే భద్రత సిబ్బంది అప్రమత్తమ్యారు. ఆ క్రమంలో ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ముక్కు నుంచి ధారాపాతంగా కారుతుండడంతో ఆయన చొక్క మొత్తం రక్తంతో తడిసిపోయింది. ముడా కుంభకాణంపై పోరాటానికి సంబంధించిన కార్యాచరణపై ఆదివారం బీజేపీ, జేడీఎస్ నేతలు సమావేశమయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కేంద్ర మంత్రి కుమార స్వామికి అస్వస్థత !
by Telugu Lo Computer at July 28, 2024
Labels:
karnataka
,
national
,
ఆయన చొక్క మొత్తం రక్తంతో తడిసిపోయింది
,
కేంద్ర మంత్రి కుమార స్వామికి అస్వస్థత
,
ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం స్రవించడం ప్రారంభమైంది
,
విలేకర్ల సమావేశంలో
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment