Ad Code

గులాబీలతో పకోడీ - వీడియో నెట్టింట వైరల్ !


పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటే ఇదేనేమో. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. పకోడికి అర్థాన్ని మార్చేస్తూ ఓ వ్యక్తి గులాబీలతో పకోడి చేస్తున్నాడు. అయితే ఏదో ఇంట్లో సరదాగా చేసుకుంటున్నాడంటే పొరబడినట్లే. ఎంచక్కా బండిపై చేసిన అమ్ముతుంటే ప్రజలు క్యూలో నిలబడి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ఆ వ్యక్తి ఎర్రటి గులాబీ కాడలను నీట్‌గా కట్ చేశాడు. అనంతరం అచ్చంగా పకోడి కోసం రడీ చేసుకున్నట్లుగానే శనగపిండిలో కారం, ఉప్పుతో పాటు కావాల్సిన అన్ని వస్తువులను వేశాడు. అనంతరం నీటిని పోసి పిండిన రడీ చేసుకున్నాడు. ఇంకేముంది అంతకు ముందు కట్ చేసి పెట్టుకున్న గులాబీలను ఒక్కొక్కటి పిండిలో ముంచుతూ వేడి వేడి నూనెలో వేయించాడు. వెంటనే ప్లేట్‌లో వేసి ఇవ్వడంతో అప్పటికే ఎదురు చూస్తున్న కస్టమర్స్‌ లొట్టలేసుకొని తింటున్నారు. దీనతంటినీ వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో తెగ్ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు గులాబీతో పకోడి ఏంటి బాబూ అంటూంటే మరికొందరు మాత్రం, గులాబీ పువ్వు ఆరోగ్యానికి ఎలాగో మంచిది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu