మమతను అవమానించడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య : సంజయ్ రౌత్


నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న సమయంలో మైక్‌ కట్‌ చేయడాన్ని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సమస్యలు ఉంటాయి. వాటిని తెలపడానికి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మమత మైక్‌ను మ్యూట్‌ చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమన్నారు. బడ్జెట్‌లో భాజపా పాలిత రాష్ట్రాలకు మాత్రమే నిధులు, పథకాలు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ తమిళనాడు, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించారు. కాగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. అయితే తాను ప్రసంగిస్తున్న సమయంలో మైక్‌ను ఆపేశారని ఆరోపిస్తూ దీదీ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.ఆంధ్రప్రదేశ్, గోవా, అస్సాం ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు చెందిన ఇతర ముఖ్యమంత్రులు మాట్లాడటానికి ఎక్కువ సమయం ఇచ్చారని ఆమె ఆరోపించారు. కేంద్రం ఆమె మాటలను తోసిపుచ్చింది. సమావేశంలో మమత మాట్లాడడానికి కేటాయించిన సమయం ముగియడంతో ఆమె మైక్రోఫోన్ ఆఫ్ అయ్యిందని పేర్కొంది.

No comments:

Post a Comment

3