భారత్‌లోకి అక్రమంగా ఎలా ప్రవేశించవచ్చో వీడియోలో వివరించిన బంగ్లాదేశ్‌ యూట్యూబర్ ?

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా ఎలా ప్రవేశించ వచ్చునో ఓ యూట్యుబర్ వివరించాడు. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యూట్యూబర్ డిహెచ్ ట్రావెలింగ్ ఇన్ఫో పేరిట ఓ యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నాడు. ఎటువంటి పత్రాలు లేకుండా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ఎలా వలస వెళ్ల వచ్చునో తన వీడియోలో కళ్లకు కట్టినట్లు వివరించాడు. ఈ వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. బంగ్లాదేశ్‌, సునంగంజ్ జిల్లాలోని సిల్హెట్ డివిజన్‌లో నిలిచి సదరు యూట్యూబర్.. భారత్‌లోనికి ఎలా ప్రవేశించ వచ్చో ఈ వీడియోలో చూపించారు. ఈ రహదారి వెంట వెళ్లితే.. భారత్‌లోకి వెళ్లిపోతామని అతడు వివరించాడు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో ఈ మార్గం ఎంచుకున్న వారు.. సరిహద్దు భద్రతా సిబ్బంది (బీఎస్ఎఫ్)కి చిక్కితే మాత్రం తదనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. అలాగే భారత్ భూభాగంలోని బీఎస్ఎఫ్ శిబిరాన్ని సైతం అతడు తన వీడియోలో చూపించాడు. కానీ చట్ట విరుద్దంగా భారత్‌లోకి ప్రవేశించ వద్దంటూ బంగ్లాదేశీయులకు ఈ సందర్భంగా విజ్జప్తి చేశాడు. అలా భారత్‌లోకి ప్రవేశించడం ద్వారా మన దేశం పేరు చెడగొట్ట వద్దంటూ బంగ్లాదేశీయులకు సూచించాడు. మరోవైపు ఈ వీడియోను యూట్యూబర్ చాలా కాలం క్రితం చేశాడు. దీనిని ఇటీవల అంటే జులై 26న మళ్లీ సోషల్ మీడియాలోకి వదిలాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 2 లక్షల మంది వీక్షించారు. అలాగే 7 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.


Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default