Posts

Showing posts with the label economic fury

ఇరాన్ విమానయాన సంస్థలతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపవద్దు : విదేశీ కంపెనీలకు యూఎస్ ట్రెజరీ ఆదేశాలు జారీ

Image
ఇ రాన్ విమానయాన సంస్థలతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపవద్దని విదేశీ కంపెనీలకు యూఎస్ ట్రెజరీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఈ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా సేవలు అందిస్తే, వారు కూడా అమెరికా కఠిన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇరాన్‌పై 'ఎకనామిక్ ఫ్యూరీ'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, విదేశీ ప్రభుత్వాల పరిధిలోని కంపెనీలు ఇరాన్ విమానాలకు ఎలాంటి సహకారం అందించకూడదని పేర్కొన్నారు. ముఖ్యంగా జెట్ ఇంధనం సరఫరా, క్యాటరింగ్, ల్యాండింగ్ ఫీజులు, విమానాల నిర్వహణ వంటి సేవలను నిలిపివేయాలని సూచించారు. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేసేందుకు అమెరికా ట్రెజరీ ఎంతటి కఠిన చర్యలకైనా వెనకాడదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆంక్షలతో ఇబ్బంది పడుతున్న ఇరాన్ విమానయాన రంగానికి ఇది కోలుకోలేని దెబ్బ కానుంది.