కర్ణాటక రాష్ట్రంలో మైసూరు జిల్లాలో విచిత్రమైన రీతిలో దొంగతనం జరిగింది. దొంగ భారీ ఎత్తున నగలు, డబ్బు ఎత్తుకెళ్లినా అతడు చోరీ చేసిన విధానం భయానకంగా ఉంది. జేపీ నగర్లో అర్థరాత్రి సమయంలో సినిమా రేంజ్లో చోరీ జరిగింది. ఓ ఇంట్లో దూరిన దొంగ ఇంటి తాళం పగలగొట్టే ముందు గుమ్మం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. నిమ్మకాయలు, ముగ్గు, పసుపు, కుంకుమతో పూజ చేశాడు. అనంతరం ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి దూరాడు. దొంగ ఇంట్లో ఉండగానే ఆ ఇంటి యజమాని వచ్చేశాడు. దీంతో షాక్ అయిన దొంగ తన వద్దనున్న కత్తి, మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడి, 135 గ్రాములకు పైగా బంగారం, కొంత డబ్బు దోచికొని అక్కడి నుంచి పారిపోయాడు. బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గుమ్మం ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించి దొంగతనం చేసిన దొంగ !
by Telugu Lo Computer at July 28, 2024
Labels:
Criem
,
karnataka
,
కుంకుమతో పూజ
,
గుమ్మం ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించి దొంగతనం చేసిన దొంగ
,
నిమ్మకాయలు
,
పసుపు
,
ముగ్గు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment