ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు, ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మని ఎఫ్ఎన్ సి సి. ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎన్ సి సి కార్యవర్గం సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి.వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి, జే. బాలరాజు, ఏడిద రాజా, సామా ఇంద్రపాల్ రెడ్డి,మరియు ఎఫ్ . న్.సి.సి ఫార్మర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు . ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు నిర్మాతల మండలి సెక్రెటరీ టి. ప్రసన్నకుమార్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ పార్లమెంట్ సభ్యులు, ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ సౌత్ లోనే నెంబర్ వన్ క్లబ్ గా ఫిల్మ్ నగర్ క్లబ్ కి పేరు వుందని, ఎఫ్ ఎన్ సి సి ఎప్పుడూ మంచి కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. నేషనల్ గేమ్స్ మరియు ప్రోగ్రామ్స్ చేస్తూ క్రీడాకారులను, కళాకారులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సంస్థ ఇలాగే అంచలంచెలుగా ఇంకా ఎదగాలని కోరుకుంటూ నా వంతు సహాయం ఎప్పుడు కావాలన్న క్లబ్ కి అందిస్తానని తెలియజేసుకుంటున్నాను అన్నారు. ఎఫ్ ఎన్ సి సి సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ మాట్లాడుతూ ప్రజా సేవలో ఎంతో బిజీగా ఉండి కూడా అడగగానే ఒప్పుకొని మా ఈ సత్కారాన్ని స్వీకరించినందుకు మంత్రివర్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి కృతజ్ఞతలు. ఎఫ్ ఎన్ సి సి తరఫున చేసే కార్యక్రమాలను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు. ఇదేవిధంగా అందరూ ఇలానే సపోర్ట్ చేస్తే ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలతో ఎఫ్ ఎన్ సి సి ని ఇండియా లోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే విధంగా మా కార్యవర్గం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది అన్నారు.
0 Comments