భార్యను చంపి, భర్త ఆత్మహత్య !
తెలంగాణలోని సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన దూస రాజేశం (54), లక్ష్మి (50) దంపతులు పెద్ద కుమారుడు, కుమార్తెకు వివాహాలు చేశారు. చిన్న కుమారుడు హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. రాజేశం పవర్‌లూమ్స్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. కొద్ది రోజులుగా అతడి రెండు కిడ్నీలు దెబ్బతిని ఇబ్బంది పడుతున్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. కిడ్నీ మార్పిడి చేయించాలని రాజేశం కోరగా, కొంచెం సమయం పడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం కొడుకు, కోడలు ఓ శుభకార్యానికి వెళ్లగా.. ఇంట్లో రాజేశం, లక్ష్మి ఇద్దరే ఉన్నారు. కుటుంబసభ్యులు వచ్చిచూసేసరికి ముఖంపై రాడ్డుతో కొట్టిన గాయంతో లక్ష్మి మృతి చెంది ఉండగా రాజేశం గదిలో ఉరేసుకుని మృతి చెందారు. వారిమధ్య ఏదైనా వాగ్వాదం జరిగి క్షణికావేశంలో ఈ ఘటనలు జరిగి ఉంటాయన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కృష్ణ తెలిపారు.