Ad Code

ఓపెన్ ఏఐ సెర్చ్ జీపీటీ సెర్చ్ ఇంజిన్ ?


పెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చ్ ఇంజిన్ ను తీసుకువస్తోంది. ఈ సెర్చ్ ఇంజిన్ కు 'సెర్చ్ జీపీటీ' అనే పేరు ఖారారు చేసింది. ఇది పూర్తిగా ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ అని ఓపెన్ ఏఐ తెలిపింది. ఈ ఫీచర్ వాడుకలోకి వస్తే గూగుల్ కు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం సెర్చ్ జీపీటీ అతికొద్ది మంది యూజర్లు, పబ్లిషర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మరికొంత మందికి దీని యాక్సెస్ ఇవ్వనుంది సంస్థ. సెర్చ్ జీపీటిని పొందాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. దీనికి సంబంధించిన ఫీచర్లను ఓపెన్ ఏఐ వెబ్ సైట్లో ఉంచింది. ఇది ఎలా ఉంటుంది? ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ఓ వీడియోను సైతం పంచుకుంది. ఫీచర్స్ ఇలా ఉన్నాయి.. యూజర్లు అడిగే క్వెరిలీకు ఏఐ సామర్థ్యంతో వెబ్ మొత్తం వెతికి సరైన సమాధానాలను అతి తక్కువ సమయంలోనే అందిస్తుంది. ఇదే ప్రోటో టైప్ సెర్చ్ జీపీటీ లక్ష్యమని కంపెనీ తెలిపింది. సెర్చ్ జీపీటీ ప్రారంభ పేజీ గూగుల్ ను పోలి ఉంది. దీన్ని ఓపెన్ చేయగానే “మీరు దేని కోసం చూస్తున్నారు?” అనే సందేశం కనిపిస్తుంది. సెర్చ్ క్వైరీని ఎంటర్ చేసిన తరువాత, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ వ్యూ ఫీచర్ తో సమాధానం లభిస్తుంది. మీకు కావాల్సిన సమాచారం కోసం టెక్ట్స్ టైప్ చేసి ఎంటర్ బటన్ లైదా సెర్చ్ బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

Post a Comment

0 Comments

Close Menu