విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు !
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి విశాఖపట్నంలోని భీమిలో బీచ్ వద్ద ఉన్న కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన ఓ కాంక్రీట్ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీవీఎంసీ తాజాగా నోటీసులు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆమెకు ఊరట దక్కలేదు. గతంలో విశాఖ బీచ్ వెంబడి ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేయాలని నేరుగా హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు సింగిల్ బెంచ్ నిరాకరించింది. సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఈ మేరకు స్టే ఇవ్వాలని కోరుతూ చేసిన వినతిని హైకోర్టు సింగిల్ బెంచ్ తోసిపుచ్చింది. దీనిపై కావాలంటే హైకోర్టు సీజే బెంచ్ వద్దే తేల్చుకోవాలని సూచించింది. ఇప్పటికే సింగిల్ బెంచ్ ఈ వ్యవహారాన్ని సీజే బెంచ్ కు రిఫర్ చేసినా తిరిగి ఛీఫ్ జస్టిస్ సింగిల్ బెంచ్ వద్దే తేల్చుకోవాలని సూచించారు.