మహిళల ఆసియా కప్‌ విజేత శ్రీలంక !


మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌ పోరులోటీమ్‌ఇండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి శ్రీలంక టైటిట్‌ను అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. చమరి ఆటపట్టు (61), హర్షిత సమర విక్రమ (69), కవిషా దిల్హరి (30) రాణించారు. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (60 - 47 బంతుల్లో 10 ఫోర్లు) అదరగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (29 - 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), రిచా ఘోష్‌ (23 - 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. షఫాలీ వర్మ (16), ఉమా ఛెత్రి (9), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (11) నిరాశపర్చారు. శ్రీలంక బౌలర్లలో కవిషా 2, సచిని నిశంసల, చమరి ఆటపట్టు, ఉదేశిక ప్రబోధని ఒక్కో వికెట్ పడగొట్టారు.

No comments:

Post a Comment

3