దేశంలో పాము కాటుతో ఏటా 50 వేల మంది మృతి !


దేశంలో పాము కాటుతో ఏటా దాదాపు 50 వేల మంది ఈ కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాముకాటు మరణాల్లో అత్యధికం భారత్‌లోనే చోటుచేసుకున్నట్లు లోక్‌సభలో భాజపా ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ వెల్లడించారు. ''ప్రతి ఏడాది దేశంలో 30-40 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. ఇందులో 50 వేల మంది చనిపోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం. ఇక బీహార్‌ పేదరికంతోపాటు ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది'' అని ఎంపీ రూఢీ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. చాలా పాము కాటు మరణాలను నివారించవచ్చని, వాతావరణ మార్పులు కూడా దీనిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆయన వివరించారు.


Post a Comment

0 Comments